Poorna: ప్రముఖ నటి పూర్ణ కీలక పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘డెవిల్’. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీని జి.ఆర్. ఆదిత్య డైరెక్ట్ చేశారు. దీనిని తెలుగువారి ముందుకు ‘డార్క్ నైట్’ పేరుతో తీసుకొస్తున్నారు సురేశ్ రెడ్డి కొవ్వూరి. ఇందులో త్రిగుణ్, విధార్థ్, శుభశ్రీ, రమా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ తమిళ దర్శకుడు మిస్కిన్ ఈ చిత్రంలో అతిథి పాత్రను పోషించడంతో పాటు సంగీతాన్ని అందించారు. గతంలో పూర్ణ తెలుగులో ‘అవును, అవును -2’ చిత్రాలలో చక్కని నటన కనబరిచారని,
Poorna: ఇందులోనూ ఆమె నటన హైలైట్ గా నిలుస్తుందని దర్శకుడు ఆదిత్య చెప్పారు. నాలుగు ప్రధానమైన పాత్రల మధ్య సాగే సంక్లిష్టమైన కథ ఇదని నిర్మాత సురేశ్ రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే తొలికాపీని సిద్థం చేసి ‘డార్క్ నైట్’ను విడుదల చేస్తామని అన్నారు.
ఇది కూడా చదవండి: Manchu Vishnu: సంధ్య థియేటర్ ఘట్టంపై ‘మా’ ప్రెసిడెంట్ షాకింగ్ కామెంట్స్
కేరళ కుట్టిగా జాన్వీ కపూర్!
Janhvi Kapoor: బాలీవుడ్ యువ కథానాయకుడు సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ‘పరమ్ సుందరి’ అనే ఈ రొమాంటిక్ కామెడీ మూవీని మడాక్ ఫిల్మ్ అధినేత దినేశ్ విజన్ నిర్మిస్తున్నారు. దీనికి ‘దస్వీ’ ఫేమ్ తుషార్ జలోటా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఢిల్లీకి చెందిన బిజినెస్ మ్యాన్ గా సిద్దార్థ్ నటిస్తుంటే, కేరళ అమ్మాయిగా జాన్వీ చేస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్ళి, వచ్చే జూలై 25న రిలీజ్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ వినోదాత్మక చిత్రం సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీకపూర్ కు ఎలాంటి పేరు తెచ్చిపెడుతుందో చూద్దాం.