Vicky Kaushal: బాలీవుడ్ యువ కథానాయకుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ చిత్రం ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. దీనికంటే ముందే విక్కీ మరో క్రేజీ కాంబినేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నాడు. ‘ఏక్ థా టైగర్, బజరంగీ భాయీజాన్’ చిత్రాల దర్శకుడు కబీర్ ఖాన్ తో విక్కీ ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కబీర్ అప్లాజ్ ఎంటర్ టైన్ మెంట్స్ తో రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడు. అందులో ఒకటి విక్కీ కౌశల్ మూవీనే బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.
