Sankranthiki Vasthunnam

Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి పాటల ముస్తాబు

Sankranthiki Vasthunnam: సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కాబోతోంది వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఇందులో సంక్రాంతి సందర్భంగా వచ్చే ఓ పాటను ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో ఈ పాటకు స్వర రచన చేశారు. వెంకటేశ్‌, ఐశ్వర్య రాజేశ్‌, మీనాక్షి చౌదరితో పాటు పలువురు ఈ పాట చిత్రీకరణలో పాల్గొన్నారు. దీనికి భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు విడుదల అయ్యాయి. ‘గోదారి గట్టు’ సాంగ్ టాప్ 20 వీడియోస్ లిస్ట్ లో చోటు సంపాదించుకుంది. సెకండ్ సింగిల్ గా ‘మీను’ రిలీజ్ అయ్యింది.

Sye Movie: కొత్త సంవత్సరం తొలి రోజున మరోసారి ‘సై’

Sye Movie: యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన సినిమా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘సై’. 2004లో థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు రీ-రీలీజ్ కాబోతోంది. మెగా ప్రొడక్షన్స్ సంస్థ జనవరి 1న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ తో దీనిని జనం ముందుకు తీసుకురాబోతున్నారు. విజయేంద్రప్రసాద్ కథను అందించిన ఈ సినిమా రగ్బీ ఆట చుట్టూ సాగుతుంది. తమ కాలేజ్ స్థలంపై కన్నేసిన విలన్ కు హీరో బృందం ఎలా బుద్ధి చెప్పిందన్నదే ‘సై’ కథ. ఇటీవల నితిన్ నటించిన ‘ఇష్క్’ రీ-రిలీజ్ అయ్యి చక్కని ఆదరణ పొందిన నేపథ్యంలో ‘సై’కూ ఆదరణ లభిస్తుందనే ధీమాను మెగా ప్రొడక్షన్స్ సంస్థ వ్యక్తం చేస్తోంది.

Sye Movie

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NTR: ఛావా కోసం రంగంలో దిగిన తారక్?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *