Karnataka: కర్ణాటకలోని చిక్‌మంగుళూరులో విషాధ ఘటన చోటుచేసుకుంది. మాణిక్య ధార కొండపై ఉన్న దేవిరమ్మ జాతరకు వేలాది మందికి పైగా భక్తులు పోటెత్తారు. ఎత్తులో ఉండే అమ్మవారిని దర్శించుకోవాలంటే కిలోమీటర్ల కొండను ఎక్కాల్సిందే. చలికాలం కావడంతో అమ్మవారి కొండను పొగమంచు పూర్తిగా కమ్మేసింది.
భక్తులు కూడా పరిమితికి మించి భారీగా రావడంతో.. తొక్కిసలాట జరిగింది. దీంతో కొండపై నుంచి వందలమందికి పైగా కిందకి జారిపడ్డారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని భక్తులను రక్షించారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
Karnataka: చిక్‌మంగళూరులో కొండమీద కొలువై ఉన్న బిండిగ దేవీరమ్మ నరక చతుర్ధశి నాడు భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మందికి పైగా భక్తులు కొండ మీదకు పోటెత్తారు. రాళ్లు, ముళ్లు ఉన్న దారిలోనే చెప్పులు లేకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్లారు. అయితే సముద్ర మట్టానికి 3000 ఎత్తులో ఉండే ఈ కొండపై రాత్రి సమయంలో భక్త జనం అధికమయ్యారు.
భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో పాటు వర్షం కూడా పడటంతో చీకటి లో కొండపై నడవడానికి కష్టమైంది. దీంతో భక్తులు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని దిగడంతో వర్షానికి జారిపడి తొక్కిసలాట జరిగింది. వేలాది మందికి పైగా తొక్కిసలాట జరగడంతో కొందరు కొండ మీద నుంచి కిందకి పడిపోయారు. కొందరి కాళ్లు, చేతులు కూడా విరిగిపోయాయి.