Vastu Tips: ఇంట్లోని ప్రతి వస్తువును వాస్తు నియమాల ప్రకారం సరైన స్థానంలో ఉంచితే.. ఆ ఇంట్లో ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం, సానుకూల శక్తి (Positive Energy) ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. అదే సమయంలో, కొన్ని వస్తువులను ఇంట్లో ఎప్పుడూ పూర్తిగా ఖాళీగా ఉంచకూడదని నిపుణులు సూచిస్తుంటారు. అలాంటి వస్తువులలో మనం ప్రయాణాలకు వాడే సూట్‌కేస్ (ట్రావెల్ బ్యాగ్) కూడా ఒకటి.
సాధారణంగా మనం ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు సూట్‌కేస్‌లో బట్టలు, సామాన్లు సర్దుకుని వెళ్తాం. తిరిగి వచ్చిన తర్వాత ఆ వస్తువులన్నీ బయటకు తీసి, ఖాళీ సూట్‌కేస్‌ను లేదా ట్రాలీ బ్యాగ్‌ను అలాగే రూమ్ మూలలో పెట్టేస్తాం. అయితే, ఇలా ఖాళీ సూట్‌కేస్‌ను ఉంచడం వల్ల ఇంట్లో ఎలాంటి దోషాలు వస్తాయో ఇపుడు తెలుసుకుందాం.
ఇంట్లో ఖాళీ సూట్‌కేస్ ఉంచడం మంచిదేనా?
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఖాళీ సూట్‌కేస్‌ను ఉంచడం అస్సలు శుభప్రదం కాదు. మీరు సూట్‌కేస్‌ను పూర్తిగా ఖాళీగా చేసి ఇంట్లో ఎక్కడైనా పెట్టేస్తే.. అది ఇంట్లోకి ప్రతికూల శక్తిని (Negative Energy) ఆకర్షిస్తుంది. ఖాళీగా ఉండే వస్తువులు నెగెటివిటీని త్వరగా లాక్కుంటాయి.
నిపుణుల చిన్న చిట్కా: మీరు ఎప్పుడైనా ప్రయాణం ముగించుకుని సూట్‌కేస్‌ను లోపల పెట్టేటప్పుడు.. దాని దుష్ప్రభావం పడకుండా ఉండటం కోసం అందులో ఏదైనా ఒక చిన్న వస్తువు లేదా ఒక శుభ్రమైన నూతన వస్త్రాన్ని (గుడ్డను) వేసి ఉంచడం మంచిది.
సూట్‌కేస్ ఉంచడానికి సరైన దిశ ఏది?
ఇంట్లో సూట్‌కేస్ లేదా ట్రాలీ బ్యాగులను భద్రపరిచేటప్పుడు దిశల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పుడు దిశలో పెడితే జాతకంలో గ్రహాల ప్రభావం మారుతుంది.
-
ఈ దిశల్లో అస్సలు పెట్టకూడదు: సూట్‌కేస్‌లను ఇంట్లోని ఈశాన్యం (ఉత్తర-తూర్పు) దిశలో అస్సలు ఉంచకూడదు. ఈ మూల ఖాళీగా, తేలికగా ఉండాలి.
-
ఉత్తమమైన దిశ: బరువైన వస్తువుల కిందికి వచ్చే సూట్‌కేస్‌లను ఉంచడానికి దక్షిణం లేదా పడమర (పశ్చిమం) దిశలు అత్యంత ఉత్తమమైనవిగా పరిగణించబడతాయి.
వాస్తు ప్రకారం సూట్‌కేస్ అనేది మీ లగ్జరీని (విలాసవంతమైన జీవితాన్ని) సూచిస్తుంది. కాబట్టి దీనిని సరైన దిశలో ఉంచడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడుతుంది. అదే తప్పుడు దిశలో ఉంచితే శుక్రుడు బలహీనపడి, జీవితంలో అనేక ఆర్థిక సమగ్రహం స్యలు, సంపద తగ్గడం, ఇంకా దురదృష్టం వచ్చే అవకాశం ఉంది.
ఇంట్లో సూట్‌కేస్ ఎక్కడ పెట్టాలి? ఎక్కడ పెట్టకూడదు?
ఎలాంటి సూట్‌కేస్‌లను ఇంట్లో ఉంచకూడదు?
ఇంట్లో నెగెటివిటీ పెరగకుండా ఉండాలంటే అలాగే మీ కెరీర్ గ్రోత్ బాగుండాలంటే క్రింది జాగ్రత్తలు తీసుకోండి..
-
విరిగిపోయిన క్వాలిటీ వద్దు: చక్రాలు (Wheels) ఊడిపోయినవి, ఎక్కడైనా చిరిగిపోయినవి లేదా విపరీతంగా మాసిపోయి మురికిగా మారిన సూట్‌కేస్‌లను ఇంట్లో అస్సలు ఉంచకూడదు.
-
ప్రయాణం తర్వాత క్లీనింగ్: ఏదైనా జర్నీ ముగించుకుని ఇంటికి రాగానే.. సూట్‌కేస్‌లోని మురికి బట్టలను వెంటనే బయటకు తీసేయాలి. ఆ బ్యాగ్‌ను బాగా క్లీన్ చేసి, ఆరబెట్టిన తర్వాతే లోపల పెట్టాలి.
ఖాళీగా మరియు మురికిగా ఉన్న సూట్‌కేస్‌లను నిర్లక్ష్యంగా ఇంట్లో పడేయడం వల్ల జాతకంలో రాహువు మరియు శుక్రుడు ఇద్దరూ బలహీనపడతారు. దీనివల్ల మీ జీవితంలో సాధించాల్సిన ఆర్థిక ఎదుగుదల, వ్యాపార ప్రగతి ఆగిపోయే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
