Mass Jathara: మాస్ మహరాజ రవితేజ నటిస్తున్న 75వ చిత్రం మాస్ జాతర. జనవరి 26 రవితేజ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్ ను చిత్ర దర్శక నిర్మాతలు విడుదల చేశారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రచయిత భాను భోగవరపు పరిచయం అవుతున్నాడు. ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజర్యం శ్రీకర స్టూడియోస్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ గ్లింప్స్ లో అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మాస్ మహరాజా రవితేజ మరోసారి కనిపించినట్టుగా అనిపించింది. వారు కోరుకునే ఎనర్జీని తెరపై రవితేజ చూపించారు. చెప్పినవి రెండు డైలాగ్సే అయినా రవితేజ తన బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నారు. థమాక తర్వాత శ్రీలీల రవితేజతో జోడీ కట్టిన `మాస్ జాతర`కు భీమ్స్ సంగీతం అందించారు.
