uttarakhand: తన సబార్డినేట్ కదా అని ఓ చిన్న పనిని అప్పగించడమే ఆమె చేసిన తప్పయింది. ఆ చిన్న పనినే అవకాశంగా తీసుకున్న ఆ నీచుడు మహిళా ఎస్ఐపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తొలిసారి దారుణాన్ని వీడియోలో చిత్రీకరించిన ఆ దుండగుడు.. బెదిరింపులకు దిగాడు. దీంతో పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తాజాగా ఆమె ఫిర్యాదుతో ఈ దురాఘతం బయటపడింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు ఘోరాలు బయటపడటంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
uttarakhand: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ పోలీస్‌స్టేషన్‌కు ఓ మహిళా ఎస్ఐని కుటుంబ కారణాల వల్ల 8 నెలల క్రితం ఉన్నతాధికారులు బదిలీ చేశారు. విధులు నిర్వహించే ప్రాంతానికి ఆమె ఇల్లు దూరంగా ఉండటంతో తొలిరోజునే ఆలస్యంగా వచ్చారు. దీంతో ఆమెను పైస్థాయి అధికారులు ఆలస్యమై మందిలించారు. మరుసటి రోజు ఆలస్యమైంది. ముఖ్యమైన పని ఉన్న కారణంగా త్వరగా విధులకు వచ్చేందుకని ఆ తర్వాతి రోజు రాత్రి సమీపంలోని ఓ హోటల్‌లో ఉండాలని నిర్ణయించుకున్నారు.
uttarakhand: ఇక్కడే ఆమెకు ఓ చిక్కొచ్చిపడింది. ఆ హోటల్‌లో తన కోసం ఓ గదిని బుక్ చేయాల్సిందిగా, తన కింద పనిచేసే ఓ కానిస్టేబుల్ అస్లాంను కోరింది. ఆమె చెప్పినట్టే గదిని బుక్ చేసిన ఆ కానిస్టేబుల్‌లో రాక్షసుడు ఉన్నాడని గ్రహించలేకపోయింది. ఆమెను తీసుకెళ్లి గదిలో దింపిన ఆ కానిస్టేబుల్ తనిఖీ చేస్తున్నట్టు నటించి గది తలుపులు మూసేశాడు. బలవంతంగా ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ సమయంలో ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం వీడియోను కూడా చిత్రీకరించాడు.
uttarakhand: లైంగికదాడి వీడియోను ఆ ఎస్ఐకి చూపించి పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు ఆ కానిస్టేబుల్. తరచూ బ్లాక్‌మెయిల్ చేస్తూ ఆమెను వేధింపులకు గురిచేస్తుండేవాడు. ఈ పరిణామాలకు భయపడిన ఆ బాధితురాలు.. ఎట్టకేలకు ఆలస్యంగా అయినా డెహ్రాడూన్‌లోని పటేల్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అక్కడి పోలీసులు సమగ్ర దర్యాప్తు చేశారు. సీసీ టీవీ పుటేజీలను పరిశీలించారు. నిందితుడిని పూర్తిస్థాయిలో విచారించారు. పలుమార్లు తీవ్రమైన లైంగికదాడులకు పాల్పడిన కానిస్టేబుల్ అస్లాంను పటేల్‌నగర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తీవ్రమైన అభియోగాల కింద నిందితుడిపై పలు కేసులు నమోదు చేశారు.