Unni Mukundan: సహజంగా ఫ్యామిలీ మూవీస్ సక్సెస్ అయినట్టుగా యాక్షన్ చిత్రాలు విజయం సాధించడం కష్టం కానీ చిత్రంగా గత యేడాది హిందీ సినిమా ‘కిల్’, మలయాళ చిత్రం ‘మార్కో’ అత్యంత భయంకరమైన యాక్షన్ చిత్రాలుగా జనం ముందుకు వచ్చి విజయం సాధించాయి. ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ చిత్రానికి ఉత్తరాది ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. దాంతో విడుదలైన 26వ రోజుకే ఈ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరిపోయింది. మలయాళంలోనే కాకుండా వివిధ భాషల్లోనూ ఈ సినిమాకు చక్కని ఆదరణ లభించింది. దాంతో దీనికి సీక్వెల్ చేసే ఆలోచనలో పడ్డారు మేకర్స్. ఈ విషయాన్ని ఉన్ని ముకుందన్ ధృవీకరిస్తూ, ‘ఉత్తరాది వారికి ఎలాంటి చిత్రాలను ఆదరించాలో బాగా తెలుసు. వారి తెలివైన ప్రేక్షకులు. మా చిత్రానికి వారి నుండి ఊహించని స్పందన రావడం ఆనందంగా ఉంది. వారిచ్చిన ప్రోత్సాహంతో ‘మార్కో’కు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాం’’ అని చెప్పాడు.