UGC: యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ అంటే యూజీసీ వచ్చే అకడమిక్ సెషన్ – 2025-26 నుండి డిగ్రీ ప్రోగ్రామ్‌లను మరింత ఈజీగా చేయాలని ఆలోచిస్తోంది. దీని ద్వారా, విద్యార్థులు వేగంగా కోర్సును పూర్తి చేయడం.. డిగ్రీని పొందడంలో సహాయం చేయడం కమిషన్ లక్ష్యంగా ఉంది. ఈ ఆలోచన అమలు లోకి వస్తే విద్యార్థులు తక్కువ వ్యవధిలో డిగ్రీ కోర్సును పూర్తి చేయవచ్చని యూజీసీ చైర్మన్ ఎం.జగదీష్ కుమార్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో.. మరో సిరీస్ కైవసం చేసుకున్న టీమ్ ఇండియా
UGC: మూడేళ్ల డిగ్రీ కోర్సును రెండున్నరేళ్లలో, నాలుగేళ్ల డిగ్రీ కోర్సును మూడేళ్లలో పూర్తిచేసే వెసులుబాటును కల్పిస్తున్నట్లు యూజీసీ చైర్మన్ ఎం.జగదీశ్ కుమార్ ప్రకటించారు. అలాగే, నెమ్మదిగా చదువును పూర్తి చేయాలనుకునే విద్యార్థులకు కూడా వెసులుబాటు కల్పించనున్నారు. ఇప్పుడు వారు కూడా 3 సంవత్సరాల కోర్సును నాలుగేళ్లలో పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా ఒక విద్యార్థికి మధ్యలో బ్రేక్ అవసరమైతే, అతను లేదా ఆమె కోర్సును మధ్యలోనే వదిలివేసి, తర్వాత దాన్ని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేయవచ్చు. ఈమేరకు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ వీ కామకోటి నేతృత్వంలోని కమిటీ సిఫార్సులను యూజీసీ ఆమోదించింది. దీనికి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని జగదీష్ కుమార్ తెలిపారు.