SL vs AUS: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో రెండు అద్భుతమైన సెంచరీలు నమోదయ్యాయి. ఆసీస్ వికెట్‌కీపర్ మరియు బ్యాట్స్‌మన్ ఆలెక్స్ క్యారీ, తాత్కాలిక కెప్టెన్ స్టీవ్ స్మిత్ వీరిద్దరూ శతకాలు సాధించారు. ఈ సెంచరీలతో పలు రికార్డులను సృష్టించారు. ఇలా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 73 పరుగుల ముందంజలో ఉండగా వారికి 7 వికెట్లు చేతిలో ఉండడం గమనార్హం..!
రెండవ టెస్ట్ లో అయిదవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన క్యారీ ఎట్టకేలకు ఒక శతకం సాధించాడు. అయితే శ్రీలంక గడ్డపై ఇలాంటి ఆటతీరు ప్రదర్శించడం నిజంగా ప్రశంసనీయం. అలెక్స్ క్యారీ… 118 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో తన కెరీర్‌లో రెండో టెస్ట్ శతకాన్ని చేరుకున్నాడు.
చివరికి రెండో రోజు ఆట ముగిసేసరికి 156 బంతుల్లో 139* పరుగులు చేశాడు, ఇందులో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. గతంలో క్యారీ తన మొదటి టెస్ట్ శతకాన్ని 2022 బాక్సింగ్ డే టెస్ట్‌లో సాధించాడు. రెండో శతకానికి అతడు చాలా సమయం పట్టింది.
ఇది కూడా చదవండి: Delhi Elections: 26 ఏండ్ల తర్వాత బీజేపీకి చేజిక్కిన ఢిల్లీ.. ఫలితాలపై తాజా అప్‌డేట్స్
SL vs AUS: ఇదే మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ కూడా అద్భుతమైన సెంచరీని నమోదు చేశాడు. ఇది అతని టెస్ట్ కెరీర్‌లో 36వ శతకం. టెస్ట్ కెప్టెన్‌గా ఇది అతనికి 17వ శతకం. 191 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో శతకాన్ని చేరుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి 239 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 120 పరుగులు చేశాడు. శ్రీలంక పర్యటనలో ఇది స్మిత్ వరుసగా రెండో సెంచరీ, మొదటి మ్యాచ్‌లో కూడా అతను శతకం సాధించిన విషయం తెలిసిందే.
ఈ శతకంతో స్మిత్ ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ రికార్డును సమం చేశాడు. రూట్ కూడా 36 శతకాలతో స్మిత్‌తో సమంగా నిలిచాడు. ఫాబ్ ఫోర్‌లో స్మిత్, రూట్ 36 సెంచరీలతో ఉన్నారు, కేన్ విలియమ్సన్ 33, విరాట్ కోహ్లీ 30 శతకాలతో తర్వాత స్థానాల్లో ఉన్నారు.
అలాగే, ఈ శతకంతో స్మిత్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ద్రవిడ్, జో రూట్ వంటి వారితో సమంగా నిలిచాడు, ఈ జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నాడు. టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డు సచిన్ తెందుల్కర్ (51) పేరుతో ఉంది.