Tragedy News: చదువుకోవాలి అని ఎంత ఆశ ఉన్నా ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు దూరంగా ఉంటారు చాలా మంది.. కూలీ పనికి వెళ్తే గాని పూటగడవని కుటుంబం రాధమ్మ దంపతులది వీల పేదరికానికి తోడు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి.. వీలని చదివించాలి అని ఉన్న పేదరికం వల్ల అది కుదరలేదు. కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. తల్లిదండ్రులు పడే కష్టం చూడలేక వాళ్ళకి సాయం చేయాలి అని అనుకున్న పెద్ద కూతురు 5వ తరగతి తర్వాత చదువు మానేసి వాళ్ళకి తోడుగా పనికి వేళేది.. రెండవ కూతురు శ్రావణి ని ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు చదివించారు.తర్వాత 6వ తరగతి నుండి ఇంటర్ వరకు ఎలాగైనా చదివించాలి అనుకోని దానికి తగ్గ అవకాశాల కోసం ఎదురు చూశారు.అందులో భాగంగానే KGBV లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష రాయించారు.అందులో శ్రావణి మంచి మార్కులు సాధించింది. దింతో చిప్పగిరి KGBVలో సీటు తెచ్చుకుంది. సీటు రావడంతో తల్లితండ్రులు ఆనందం కి అడ్డులు లేకుండాపోయాయి.
గ్రామంలో కనిపించిన ప్రతి ఒక్కరికి కూతురికి సీటు వచ్చిన సంగతి చెబుతూ వచ్చారు.కుదిరిన ప్రతి సారి వెళ్లి శ్రావణిని వెళ్లి కలిసేవారు. బాగా చదువుకో అమ్మ అని చెప్పేవారు. ఆలాగే మూడో కూతురు కూడా ఆస్పరి కేజీబీవీలో 6వ తరగతి చదువుతోంది.కుమారుడు ముత్తుకూరు ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్నాడు.
ఇది కూడా చదవండి: Missing Case: సిరిసిల్ల జిల్లాలో పంచాయతీ కార్యదర్శి అదృశ్యం.. డీపీవోకు రాజీనామా.. కారణాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ లో వేసవి సెలవులు ఇవ్వడంతో త్రండ్రి ఈరన్నతో పాటు కూతురు శ్రావణి బైక్‌పై ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామానికి బయలుదేరింది. బైక్ పైన తండ్రి తో ఆనందంగా వెళ్తున్న వారికీ అనుకోని అతిధిగా మృతువు ఎదురైంది. అటుగా వెళ్తున్న వాటర్ టాంకర్ ముందుఉన్న గుంతని తపించబోయి. బైక్ ను ఢీకొట్టింది అదే బైక్ పై వస్తున్న శ్రావణి- త్రండ్రి ఈరన్న టైర్ కింద పడి అక్కడికి అక్కడే మృతి చెందారు. దీనిపై కేసు నమోదు చేసి ట్యాంకర్ డ్రైవర్ మత్తులో ఉన్నారా లేదా రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి బైక్‌ను ఢీకొన్నారా అనే విషయంపై పోలీసుల విచారణ చేపట్టారు. శ్రావణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే శ్రావణితో పాటు చదివే విద్యార్థులు, టీచర్లు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, తన సొంత ఊరు చిప్పగిరి KGBVలో చదువుతూ తండ్రి ఈరన్నతో పాటు మృతి చెందిన శ్రావణి మరణవార్త విని MLA వీరుపాక్షి అవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్ళి మృతదేహాలను పరిశీలించి తన వంతు ఆర్ధిక సాయం చేశారు.