Tirupati: తిరుపతి తొక్కసలాట ఘటనలో మృతుల వివరాలను ఎట్టకేలకు గుర్తించారు. వైకుంఠ ఏకాదశి పర్యదినాన తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తులకు టోకెన్ల జారీ క్యూలైన్లలో జరిగిన ఈ తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు. ఈ విషాద ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రులకు వైద్య చికిత్స లు అందిస్తున్నారు. కొందరు కోలుకుంటుండగా, మరికొందరు తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
Tirupati: తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, నరసరావుపేట, తమిళనాడు ప్రాంతాలకు చెందిన భక్తులు మరణించారు. చనిపోయిన భక్తులంతా 50 ఏండ్ల లోపు వారే. వీరిలో వారి పేర్లు, ప్రాంతం వివరాలు కింది విధంగా ఉన్నాయి.
1) లావణ్య స్వాతి (37) తాటిచెట్లపాలెం, విశాఖపట్నం
2) శాంతి (35) కంచర్లపాలెం, విశాఖపట్నం
3) రజని (47) మద్దెలపాలెం, విశాఖపట్నం
4) బాబు నాయుడు (51) రామచంద్రాపురం, నరసరావుపేట
5) మల్లిగ (50) మేచారి గ్రామం, సేలం జిల్లా తమిళనాడు
6) నిర్మల (45) పొల్లాచ్చి, తమిళనాడు