Game Changer: ప్రముఖ నిర్మాత, ఎఫ్.డి.సి. ఛైర్మన్ దిల్ రాజు కోరిక నెరవేరింది. ఆయన వినతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవించారు. తెలంగాణలోనూ ‘గేమ్ ఛేంజర్’ టిక్కెట్ రేట్లను పెంచారు. ‘గేమ్ ఛేంజర్’ మూవీని విడుదల రోజు అంటే 10వ తేదీ ఆరు ప్రదర్శించుకోవచ్చని అన్నారు. ఆ రోజు మాత్రం మల్టిప్లెక్స్ థియేటర్లలో 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో వందరూపాయలు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు. అలానే 11వ తేదీ నుండి 19వ తేదీ వరకూ ఐదు ఆటలు ప్రదర్శించుకోవచ్చని, ఆ తేదీలలో మల్టీప్లెక్స్ థియేటర్లలో వంద రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో యాభై రూపాయలు టిక్కెట్ ధర పెంచుకునే ఆస్కారమిచ్చారు. ఇదిలా ఉంటే… బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ టిక్కెట్ రేట్లు పెంచమని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరనని ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ చెప్పారు.