Tirumala: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పలువురు వివిధ రంగాల ప్రముఖులు తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉత్తర ద్వారదర్శనం ద్వారా వారు స్వామివారిని దర్శించుకొని తరించారు. వారిలో రాజకీయ ప్రముఖులు అధికంగా ఉన్నారు. ఇదిలా ఉండగా, తిరుపతిలో దర్శన టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తుల ప్రాణాలు పోయినా వీఐపీల దర్శనాలపై అక్కడికొచ్చిన పలువురు భక్తులు అభ్యంతరాలను వ్యక్తం చేయడం గమనార్హం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ప్రముఖులు ఈ కింది విధంగా ఉన్నారు.
Tirumala: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్ బాబా, తెలంగాణ శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఏపీ మంత్రులు అనిత, కొలసు పార్థసారథి, నిమ్మల రామానాయుడు, సవిత, సంధ్యారాణి స్వామివారిని దర్శించుకున్నారు.
Tirumala: అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనచారి, పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, గడ్డం వివేక్, చామకూర మల్లారెడ్డి, కడియం శ్రీహరి, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
Tirumala: ఏపీకి చెందిన ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆర్ కృష్ణయ్య, సీఎం రమేశ్, తెలంగాణ ఎంపీ డీకే అరుణ ఉత్తర ద్వార దర్శనంద్వారా స్వామివారిని దర్శించుకున్నారు. అదే విధంగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్ స్వామివారిని దర్శించుకున్న ప్రముఖుల్లో ఉన్నారు. పలువురు సినీరంగ ప్రముఖులు కూడా శుక్రవారం తిరుమలకు వచ్చారు. వారిలో సినీ నిర్మాత బండ్ల గణేశ్, సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్, నటుడు శ్రీనివాస్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.