India: భారతీయులు అత్యధికంగా టీవీల్లో చూసే కంటెంట్ ఏమిటో తెలుసా? సినిమాలు, సీరియళ్లు, సిరీస్‌లలో ఏ కంటెంట్ అంటే ఎక్కువ ఇష్టమో తెలుసా? సరిగ్గా ఇదే అంశాన్ని తెలుసుకునేందుకు స్టాటిస్టా కన్జ్యూమర్ ఇన్‌సైట్ అనే ఓ సర్వే సంస్థ సర్వే నిర్వహించింది. గురువారం వరల్డ్ టెలివిజన్ డేను పురస్కరించుకొని ఈ సర్వే వివరాలను విడుదల చేసింది. ఆ సర్వేలో భారతీయులు ఏ కంటెంట్‌ను ఎక్కువగా చూస్తున్నారో తేలిపోయింది.
వివిధ అంశాల్లో ప్రజలపై పెరుగుతున్న టెలివిజన్ ప్రభావాన్ని గుర్తిస్తూ ఐక్యరాజ్య సమతి 1996లో నవంబర్ 21న వరల్డ్ టెలివిజన్ డేను ప్రకటించింది. అప్పటి నుంచి ఏటా నవంబర్ 21న వరల్డ్ టెలివిజన్ డేను పాటిస్తారు. ఈ నేపథ్యంలో 2023 అక్టోబర్ నుంచి 2024 సెప్టెంబర్ నెలల మధ్యన స్టాటిస్టా కన్జ్యూమర్ ఇన్‌సైట్ సంస్థ వివిధ దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం భారత్‌లో జనం ఎక్కువగా కామెడీని ఇష్టపడుతున్నారని తేలింది.
India: కామెడీ తర్వాత స్పోర్ట్స్, ఆ తర్వాత మ్యూజిక్ వీడియోలు లేదా షోలు, థ్రిల్లర్ మిస్టరీలు, హారర్ సీరియళ్లను వరుసగా ఇష్టపడుతున్నారని సర్వేలో తేలింది. సర్వే ప్రకారం భారత్‌లో 63 శాతం మంది కామెడీ విషయాలపై ఆసక్తిని చూపుతున్నారని తెలిసింది. అదే విధంగా ఫిన్లాండ్ దేశంలో అత్యథికంగా 65 శాతం మంది డాక్యమెంటరీలను ఇష్టపడుతున్నారు.
అదే విధంగా అమెరికాలో 64, ఫ్రాన్స్‌లో 63 శాతం మంది చొప్పున కామెడీ, ఇంగ్లండ్‌లో 61 శాతం మంది కామెడీ, డ్రామాను, జర్మనీలో 58 శాతం మంది కామెడీ, బ్రెజిల్‌లో 57 డాక్యుమెంటరీలను, జపాన్‌లో 24 డ్రామాను ఇష్టపడుతున్నారని స్టాటిస్టా కన్జ్యూమర్ ఇన్‌సైట్ సర్వేలో తేలింది.