Sankranthiki Vastunnam: ముందు నుంచి అనుకున్నట్టుగానే వెంకటేశ్ – అనిల్ రావిపూడితో దిల్ రాజు నిర్మిస్తున్న మూడో సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ పొంగల్ కే రాబోతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 14న ఈ సినిమా విడుదల అవుతోందని తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని తెలిపారు. విశేషం ఏమంటే… ఈ సంక్రాంతికి దిల్ రాజు బ్యానర్ నుండే రెండు సినిమాలు వస్తున్నాయి. అందులో మొదటిది ‘గేమ్ ఛేంజర్’ జనవరి 10న వస్తుంటే… ‘సంక్రాంతికి వస్తున్నాం’ 14న విడుదల కాబోతోంది.