Waste Tax Cancel: చెత్త పన్ను రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం, ఈ బిల్లును సభలో ప్రతిపాదించారు మంత్రి నారాయణ.గత వైసీపీ ప్రభుత్వం చెత్త సేకరించడానికి పన్ను విధించింది, సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా చేత సేకరించడానికి వాహనాలని ఏర్పాటు చేసి 40మున్సిపాలిటీల్లో పన్నులు వసూలు చేసింది జగన్ ప్రభుత్వం, చెత్త సేకరణకు నెలకు రూ.51,641 నుంచి రూ.62,964 వరకు చెలించేవారు, చేత పన్ను రాదు చేయాలి అని మహిళలు ధర్నాలు కూడా చేశారు. గతంలో పన్ను చెల్లించలేదని తాగునీరు నిలిపివేశారు అని మంత్రి నారాయణ చెప్పారు.
ఈ చేత సేకరించడానికి విశాఖ ప్రాంతంలో సాయి పావని, రాజమండ్రి ప్రాంతంలో శ్పాప్, గుంటూరు ,అనంతపురం రెడ్డి ఎంటర్ప్రైజెస్ కి చెత్త సేకరణ కు ఇచ్చారు. 40 మున్సిపాలిటీలలో కలిపి నెలకి 13.9 కోట్లకి ఇచ్చారు. 2021 నవంబర్ నుంచి చేతపైన పన్నుసేకరించడం మొదలు పెటింది వైసీపీ ప్రభుత్వం. నెలకి ప్రతి ఇంటికి 30 రూపాయల నుంచి 120 వరుకు వసూళ్లు చేశారు. ఇంకా బిజినెస్ చేసే వాలనుంచి నెలకి 100 నుంచి 10,000 వరకు తీసుకునే వారు. గత ప్రభుత్వం ప్రజా అభిప్రాయాలు తెలుసుకోకుండా చెత్త పన్ను వేశారు. అయితే మేము చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చాము అని మంత్రి నారాయణ వివరించారు.