Pushpa Ka Baap: చిత్రసీమలో ఒక్కో తరంలో ఒక్కొక్కరిని ఒక్కోలా గుర్తు పెట్టుకుంటారు. ‘అల్లు రామలింగయ్య కొడుకు అరవింద్’ అనిపించుకున్న నాటి రోజుల్ని అల్లు అరవింద్ చూశారు. గీతా ఆర్ట్స్ సంస్థలో గ్రాండ్ విక్టరీస్ అందుకున్న తర్వాత ‘అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్’ అని చెప్పుకున్న రోజులూ చూశారు. ఇవాళ ‘పుష్ప’తో జాతీయ స్థాయిలో అల్లు అర్జున్ కు గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ‘అల్లు అర్జున్ ఫాదర్ అరవింద్’ అని అనిపించుకుంటున్నారు. ఇది ఓ తండ్రిగా ఆయనకు ఆనందాన్నే ఇస్తుంది. శుక్రవారం అల్లు అరవింద్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా కుటుంబ సభ్యుల సమక్షంలో అరవింద్ కేక్ కట్ చేశారు. విశేషం ఏమంటే… అల్లు అర్జున్ తండ్రి కోసం ‘పుష్ప కా బాప్ బర్త్ డే’ అంటూ స్పెషల్ కేక్ తయారు చేయించారు. అలానే తన తండ్రిపై ఉన్న ప్రేమను అక్షరూపంలో ప్రకటితూ…. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.