Narendra Modi: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 29న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం రానున్నారు. ఆ రోజ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇతర ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు విశాఖ నగరంలో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఆంధ్రా యూనివర్సిటీ మైదానంలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు.
ప్రధాన మోదీ రాక నేపథ్యంలో రాష్ట్ర సీఎస్ నీరబ్‌కుమార్ రెండు రోజులపాటు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని రాకపై జిల్లా కలెక్టర్ ప్రసాద్ కూడా ఆదివారం సమీక్ష నిర్వహించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులు సమీక్షిస్తున్నారు.