Ramayana: భారతీయ సాహిత్యంలో అమర కావ్యం రామాయణం ఎన్నో తరాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇటీవల విడుదలై, ఒక ఎపిక్ అనుభవాన్ని అందిస్తూ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా నటిస్తున్నారు. గ్లింప్స్‌లో రణబీర్, యష్‌ల విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
Also Read: Vikram Vedha Makers: శివకార్తికేయన్‌తో విక్రమ్ వేద మేకర్స్ భారీ ప్రాజెక్ట్?
Ramayana: హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్‌ల సంగీతం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను అందిస్తోంది. ఈ గ్లింప్స్ భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే చిత్రంగా రామాయణం నిలుస్తుందని సూచిస్తోంది. నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి భాగం వచ్చే ఏడాది దీపావళికి విడుదల కానుంది. ఈ సినిమా బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో అన్న క్యూరియాసిటీ మొదలైంది. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.