Bujji Thalli Song: అన్నట్టుగానే సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తన స్వరాలతో మాయ చేశాడు. ‘తండేల్’ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘బుజ్జితల్లి’ అనుకున్న సమయానికంటే కాస్తంత ఆలస్యంగా వచ్చిన… వచ్చి రాగానే ఇన్ స్టెంట్ హిట్ ను అందుకుంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలకు తూకం వేసినట్టుగా శ్రీమణి భావయుక్తమైన పదాలను సమకూర్చితే… వాటిని రాగయుక్తంగా జావేద్ అలీ పాడారు. అంతే అందంగా షామ్ దత్ తన కెమెరాలో బంధించారు. నాగచైతన్య, సాయిపల్లవి జోడీ మరోసారి ఈ సినిమాతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫిబ్రవరి 7న పాన్ ఇండియా మూవీగా ‘తండేల్’ రాబోతోంది. గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ సమర్పణలో దీనిని బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ నెల 23న నాగ చైతన్య పుట్టిన రోజు… ‘తండేల్’ టీమ్ అతనికి రెండు రోజుల ముందే… గ్రాండ్ గిఫ్ట్ ను ఈ పాట రూపంలో అందించేసింది.
