NTR Rs. 100 Coin Launch: నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముద్రించిన 100 రూపాయల స్మారక నాణెంను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అదినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబీకులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరయ్యారు.
