Drumstick: కరోనా తర్వాత ప్రజలు తమ జీవనశైలిలో, ఆరోగ్యంలో చాలా మార్పులు చేసుకున్నారు. ఇక మునగకాయ ఆరోగ్యానికి మంచిది. ప్రధాని మోడీ కూడా గతంలో దీన్ని ప్రాముఖ్యతను ప్రస్తావించారు. అప్పటి నుండి మునగకు మునుపటి కంటే ఎక్కువ డిమాండ్ ఉంది. చాలా మంది తమ ఆహారంలో మునగను చేర్చుకున్నారు. చాలా ఏళ్లుగా మునగ గింజలు, ఆకులను ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. దీని ఆకులలో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే 15 రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటుంది. మునగను 300 వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది అనాల్జేసిక్, యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, క్యాన్సర్ వ్యతిరేక, డయాబెటిస్ వ్యతిరేక, యాంటీవైరల్, విటమిన్లు A, B, C లతో సమృద్ధిగా ఉంటుంది. ఇందులో విటమిన్ A, విటమిన్ B1, B2, ఫోలేట్, కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ మునగ తినడం అందరికీ మంచిది కాదు. ఎవరు మునగ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భిణీ స్త్రీలు:
గర్భిణీ స్త్రీలు మునగ, మునగ ఆకులను తినకుండా ఉండటం మంచిది. మునగ శరీరానికి వేడిని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు ఎక్కువ మొత్తంలో మునగ తీసుకుంటే ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
పీరియడ్స్:
పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం ఉన్న మహిళలు మునగను తక్కువగా తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. మునగను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో పిత్త దోషం పెరుగుతుంది. కాబట్టి, ఋతుస్రావం సమయంలో మునగను తినడం మానుకోవాలి.
తక్కువ రక్తపోటు:
తక్కువ రక్తపోటుతో బాధపడేవారు మునగ సహా దాన్ని ఆకులను కూడా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఇది బిపిని చాలా త్వరగా తగ్గించి, సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
గ్యాస్ట్రిక్ అల్సర్:
గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలు ఉన్నవారు మునగకు దూరంగా ఉండటం కూడా మంచిది. మునగను ఎక్కువగా తినడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇబ్బంది కలిగిస్తాయి.
Also Read: Urinate Frequently: వేసవిలో తరచుగా మూత్రం వస్తుందా..? ఈ సమస్యలు ఉన్నట్లే..
మానసిక ఆరోగ్యం:
మునగ తినడం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒత్తిడి, నిరాశ వంటి సమస్యలు తలెత్తుతాయి. మునగలో ఐసోథియోసైనేట్, గ్లైకోసైడ్ సైనైడ్ వంటి అంశాలు ఉంటాయి. ఈ మూలకాలు శరీరానికి విషపూరితమైనవి.
డెలివరీ తర్వాత :
ప్రసవం అయిన వెంటనే మునగ బెరడు మొదలైనవి తినడం హానికరం. పాలిచ్చే తల్లులు మునగ తింటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.