Akhanda 2: నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో మాస్ సినిమాలు అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచాయి. ఒకప్పుడు బి.గోపాల్‌తో బ్లాక్‌బస్టర్‌లు అందించిన బాలయ్య, ఇప్పుడు బోయపాటి శ్రీనుతో మాస్ మ్యాజిక్ సృష్టిస్తున్నారు. వీరి కాంబోలో వచ్చిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశాయి. ఇప్పుడు నాల్గవ చిత్రం ‘అఖండ 2 తాండవం’తో మరోసారి రచ్చ రేపేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read: Bollywood: కూతురి పేరు మీద 250 కోట్ల ఆస్తి..
Akhanda 2: ఈ సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హవాను చూపిస్తోంది. బోయపాటి సినిమాలకు లాజిక్‌లు వెతకడం కాదు, మాస్ ఎలిమెంట్స్‌ను ఆస్వాదించడమే అసలు సిసలు అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. టీజర్‌లో కొన్ని షాట్స్‌పై చిన్నపాటి చర్చ జరిగినా, మొత్తంగా బాలయ్య-బోయపాటి కాంబో మాస్ ఎనర్జీ అభిమానులను ఊరిస్తోంది. బోయపాటి తనదైన మాస్ మార్క్‌తో లాజిక్‌లను పక్కనపెట్టి, ఫ్యాన్స్‌కు థియేటర్‌లో జాతర మూడ్‌ను గ్యారంటీ చేస్తున్నారు. అఖండ 2తో బాలయ్య మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం!