Thandel: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు, విమర్శకులు సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించిన ‘తండేల్’ ప్రస్తుతం హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా 7 రోజులు పూర్తి చేసుకుంది. అయినా కానీ ఎక్కడా తగ్గకుండా కలెక్షన్స్ లో జోరు చూపిస్తుంది. తాజాగా ఈ సినిమా 7 రోజుల వసూళ్ళని రివీల్ చేసింది మూవీ యూనిట్. ఈ సినిమా 7 రోజుల్లో ఏకంగా 90.12 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టింది. ఈ మేరకు చిత్ర యూనిట్ పోస్టర్ ని విడుదల చేసింది.
