Thandel Remake: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన తండేల్ సాలిడ్ వసూళ్లతో దూసుకుపోతుంది. ఇప్పటికే 90 కోట్ల పైగా వసూలు చేసిన ఈ చిత్రం 100 కోట్ల వైపు దూసుకెలుతుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాని తమిళ స్టార్ హీరో ధనుష్ రీమేక్ చేయడానికి అమితాసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగు తో పాటు హిందీ, తమిళం లో కూడా ఏకకాలంలో విడుదలయ్యాయి. కానీ నాగ చైతన్య కి పెద్దగా ఆ ప్రాంతాల్లో పాపులారిటీ లేకపోవడం తో ఈ సినిమా అక్కడి ఆడియన్స్ కి కనీస స్థాయిలో కూడా రీచ్ అవ్వలేదు. అందుకే ధనుష్ ఈ రీమేక్ చేయడానికి మొగ్గు చూపుతున్నాడని సమాచారం తెలుస్తుంది. తమిళ్ నేటివీటికి తగ్గట్టు కథని మార్చి రీమేక్ చెయ్యాలని భావిస్తున్నాడట ధనుష్. ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలీదు సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతున్నాయి.
