Telangana: తెలంగాణ రవాణా శాఖకు ఫ్యాన్సీ నంబర్లతో ఆదాయం భాగానే సమకూరుతుంది. ఈ క్రేజీ ప్రజల్లో కూడా మితిమీరిపోతున్నది. ఫ్యాన్సీ నంబర్ల కోసం విపరీతమైన పోటీ పెరిగి భారీ నగదు చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. 9 నంబర్‌పై ఆ క్రేజీ అంతకంతకూ పెరుగుతూ వస్తున్నది. ఆ నంబర్‌పై ఎంతైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఫలితంగా రవాణా శాఖకు ఆదాయం భారీగా సమకూరుతుంది.
Telangana: తెలంగాణ రవాణా శాఖకు ఒక్కరోజే భారీ ఆదాయం సమకూరడం విశేషమే. నిన్న ఒక్కరోజే మూడు వాహనాల లక్కీ నంబర్లపై ఆ భారీ ఆదాయం సమకూరింది. ఆ ఒక్కరోజే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ కార్యాలయానికి ఏకంగా రూ.38,76,996 వచ్చి చేరింది. ఇంత ఆదాయం 9 నంబర్‌తో, 1వ నంబర్‌తో వచ్చే వాహనాల నంబర్లే కావడం విశేషం.
Telangana: టీజీ09 ఆ 0009 వాహన నంబర్‌ను 10,46,999 రూపాయలకు వెంకటేశ్ ఇజ దక్కించుకున్నారు. అదే విధంగా టీజీ 09 డీ 9999 నంబర్‌ను 6,26,000 రూపాయలకు ఎటర్నల్ అవెన్యూస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకున్నది. టీజీ 09ఈ 0001 వాహన నంబర్‌ను 4,69,9000 రూపాయలకు పేరేటి శ్రీనివాస్‌రెడ్డి దక్కించుకున్నారు.