Union Budget 2025

Union Budget 2025: వేతన జీవులు వేచి ఉండాల్సిందే! ఆదాయపు పన్నులపై బడ్జెట్ లో ఏమీ లేదు!

Union Budget 2025: లోక్ సభలో ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఆమె బడ్జెట్ ప్రసంగం ప్రారంభం కావడానికి ముందునుంచే సమాజ్ వాదీ పార్టీ ఎంపీలు సభలో నిరసనలు వ్యక్తం ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు పెట్టారు. అయినప్పటికీ నిమ్రలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగించారు.

తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అభివృద్ధిపైనే ఎక్కువ దృష్టి సారించామని చెప్పారు. ముఖ్యంగా 5 రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు వివరించారు.
పలు రంగాలకు సంబంధించి నిర్మలా సీతారామన్ ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. చాలావరకూ అభివృద్ధికి సంబంధించి కీలకమైన ప్రతిపాదనలు బడ్జెట్ లో చేశారు. విద్య, ఆరోగ్యానికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలను ఆర్ధిక మంత్రి వివరించారు. అదే సమయంలో వ్యవసాయ రంగానికి చేయూత నిచ్చే పథకాలను ప్రకటించారు.

అయితే, ఆదాయపు పన్నుకు సంబంధించి మాత్రం నిర్మలా సీతారామన్ ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమం తీసుకురానున్నట్టు చెప్పారు. వచ్చే వారంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేస్తామని ఆర్థిక మంత్రి తన బ్యాడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.

ఇది కూడా చదవండి: Nirmala Sitharaman Saree: బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో నిర్మలా సీతారామన్ ధరించిన చీర ఇచ్చిందెవరో తెలుసా ? వారి ప్రత్యేకత ఏమిటంటే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *