Diljit singh: ప్రముఖ పాప్ సింగర్ దిల్జీత్‌సింగ్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు అందజేశారు. శుక్రవారం శంషాబాద్‌లో దిల్జీత్‌సింగ్ సంగీత విభావరి కార్యక్రమం ఉన్నది. ఈ కార్యక్రమంలో ఎలాంటి మత్తు పదార్థాలను ప్రోత్సహించే పాటలను ప్రదర్శించవద్దని నోటీసులు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు తెలంగాణ అధికారులకు చండీఘర్‌కు చెందన ఒక ప్రొఫెసర్ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీసులను అందజేసింది.
Diljit singh: అక్టోబర్ నెలలో ఢిల్లీ జేఎన్‌యూలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో దిల్జీత్‌సింగ్ డ్రగ్స్, మద్యం, హింసను ప్రేరేపించే విధంగా పాటలు పాడారని ఆ ప్రొఫెసర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలంగాణ జరిగే సంగీత కార్యక్రమాల్లో అలాంటి వాటిని ప్రోత్సహించే పాటలు పాడవద్దని తెలంగాణ ఉమెన్, చైల్డ్ వెల్ఫేర్ విభాగం అధికారులు ఆ నోటీసులను జారీ చేశారు.