Telangana News:ఇది గుండె పగిలిన ఓ తండ్రి కథ. తన కూతురు తప్పిపోయిందని ఫిర్యాదు చేసిన ఆ తండ్రికి పోలీసులు ఓ చేదు నిజం చెప్పారు. ప్రేమవివాహం చేసుకున్నదని తేల్చి చెప్పారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న, ఆలనా పాలనా చూసుకున్నా, మహరాణిలో చూడాలనుకున్న.. ఒక్కసారి నా బిడ్డను చూపించండయ్యా.. అని పోలీసుల కాళ్లా వేళ్లా పడ్డాడు. పోలీసులు కనికరించినా, ఆ తండ్రిని తన కన్నబిడ్డే కాదుపొమ్మన్నది. మాట్లాడేందుకు విముఖతను వ్యక్తం చేసింది. దీంతో ఆ తండ్రి గుండె చలించింది. తల్లడిల్లింది.. నిన్నటిదాకా తన ముందే ఆడిపాడిన బిడ్డ ఇక కానరాదేమోనని చల్లబడింది. ఆ తండ్రిని కానరానిలోకాలకు తీసుకెళ్లింది.
Telangana News:పిల్లలను కంటం కానీ, పిల్లల రాతలు కనం కదా.. అన్నది తెలంగాణలో ఓ నానుడి. ఇదే నానుడి ఇక్కడ నిజమైంది. నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన రెముడాల గట్టయ్య (46) కూతురు ఉన్నట్టుండి కనిపించకుండా పోయింది. రోజంతా చూసినా రాకపోవడంతో ఆచూకీ కోసం వెతికారు. కానరాకపోవడంతో గట్టయ్య పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. బిడ్డ ఎక్కడికి పోయిందో? ఏమైందోనని తల్లీదండ్రులు తల్లడిల్లిపోయారు.
Telangana News:ఈ సమయంలో గట్టయ్యకు పోలీసులు ఓ చేదునిజం చేరవేశారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. అదే ఊరికి చెందిన ఊదరి యాదగిరి అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకున్నదని తేల్చి చెప్పారు. దీంతో గుండె పగిలినంత పనైంది. కనిపించడం లేదన్న బాధ నుంచి తల్లడిల్లిపోయేంత దాకా చేరింది. గుండెను గుణపంతో మెలేసినంత పనైంది. తన బిడ్డతో ఒక్కసారి మాట్లాడించండి.. అని పోలీసుల కాళ్లావేళ్లా పడ్డాడు గట్టయ్య.
Telangana News:పోలీసులు ప్రయత్నించినా తండ్రితో మాట్లాడేందుకు ఆ యువతి నిరాకరించింది. ఇదే విషయం పోలీసులు చెప్పే సరికి గట్టయ్యకు గుండె ఆగినంత పనైంది. తన బిడ్డేనా? ఇలా అన్నది. అపురూపంగా పెంచుకున్న తన కూతురేనా? తనతో మాట్లాడను అని అన్నది? అనుకుంటూ ఇంటిబాట పట్టాడు. కుటుంబమంతా దుఃఖసాగరంలో మునిగిపోయారు. దెబ్బమీద దెబ్బ అన్నట్టుగా గుండె బాధ ఎక్కువైంది. తట్టుకోలేకపోయాడు. తల్లడిల్లిపోయాడు.
Telangana News:బిడ్డలేదని, ఇక రాదని ఎంతగా కుమిలిపోయాడో? గట్టయ్య. మనస్తాపం చెందాడు. తన బిడ్డే లోకమనుకున్న ఆయన తనువు చాలించడమే తరువాయి అని డిసైడ్ అయ్యాడు. ఎవరూ లేనిది చూసుకొని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కూతురు కోసం రెండు మూడు రోజులు వేగం పెరిగిన ఆ గుండె అంతటితో ఆగిపోయింది. గట్టయ్యను కానరాని లోకాలకు తీసుకెళ్లింది.
తండ్రి చనిపోయిన విషయాన్ని పోలీసులే చొరవ తీసుకొని గట్టయ్య కూతురుకు తెలిపారు. ఆ హృదయంలో చలనం రాలేదని తెలిసింది. తాను ముంబైలో ఉన్నానని, తాను రావడం కుదరదని తేలికగా చెప్పేసిందట. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు మనోవేదనకు గురయ్యారు. ఇక్కడ చెప్పుకొచ్చేదేమిటంటే?
Telangana News:ప్రేమ వివాహం చేసుకోవడంపై వ్యతిరేకత కాదు.. అల్లారు ముద్దుగా పెంచి, ఆలనా పాలనా చూసి, భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన తల్లిదండ్రులను ఒప్పించి చేసుకోవాలన్నదే కాన్సెప్ట్. కాదు కూడదు అంటే చూశారు కదా.. గుండె పగిలిన గట్టయ్య గుండె కథ. ఇలా కావద్దు అంటే నేటి యువత కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.