Miss World Controversy: సౌందర్యానికి మారు పేరు అయిన మిస్ వరల్డ్ పోటీలను తలదన్నే వివాదం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. ఈ ఏడాది తొలిసారిగా భారత్‌లో, తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఈ పోటీలు ఇప్పుడు ఆరోపణలు ఎదురుకుంటున్నాయి.
ఇంగ్లాండ్‌కు చెందిన మిస్ ఇంగ్లాండ్ – మిల్లా మాగీ హఠాత్తుగా పోటీలనుంచి వైదొలగడమే కాకుండా, నిర్వహణపై చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
మేకప్‌లు, మేల్ స్పాన్సర్లు, ఒత్తిళ్లు – మిల్లా మాగీ సంచలన వాఖ్యలు
24 ఏళ్ల మిల్లా మాగీ, గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ గెలిచి, ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీల్లో భారత్‌కు వచ్చి పాల్గొనింది. అయితే పోటీల ఫైనల్స్‌కు వారం ముందు ఆమె పోటీల నుంచి వైదొలగడంతో అనుమానాలు మొదలయ్యాయి.
తదుపరి మీడియాతో మాట్లాడిన మిల్లా, “మేము ఉదయం నుంచి రాత్రివరకు మేకప్‌తో ఉండాలి. బ్రేక్‌ఫాస్ట్ కూడా మేకప్‌తోనే చేయాలి. నైట్ డ్రెస్సుల్లో ఉండాల్సి వస్తోంది. కొన్ని ఈవెంట్లలో మేల్ స్పాన్సర్లను ఆకట్టుకోవడానికి మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. ఆలా చేస్తున్నపుడు ఓ వేశ్యలా ఫీల్ అవుతున్నా” అంటూ అసహనం వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: COVID Cases In India: దేశంలో కరోనా కలకలం.. ఇద్దరు మృతి
అందాల పోటీల వెనుక అసలైన నిజాలెవరికి?
ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. సీనియర్ ఐపీఎస్ అధికారిణి డీజీ శిఖా గోయల్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది. కమిటీలో రమా రాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయి శ్రీ ఉన్నారు.
ఈ కమిటీ ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించి, మిగతా కంటెస్టెంట్ల వాంగ్మూలాలను సేకరిస్తోంది. అవసరమైతే వీడియో రికార్డింగ్స్ ద్వారా మిల్లా ఆరోపణలలో ఎంత నిజముందో వెలికితీయనున్నట్లు సమాచారం.
మిస్ వరల్డ్ సంస్థ ఖండన – వాస్తవం ఏంటి?
ఇక మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మోర్లీ మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. మిల్లా చేసిన ఆరోపణలు నిరాధారమనీ, పోటీల నిర్వహణ అంతా అత్యంత పారదర్శకంగా జరిగినదనే పట్టు పట్టారు. అయితే త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయిన తర్వాతే అసలు దానికి ఎంత వాస్తవం ఉందో తెలియనుంది.