Teenmar Mallanna: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర చర్యలు తీసుకున్నది. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై పరిశీలించిన కమిటీ ఎట్టకేలకు తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేస్తూ శనివారం (మార్చి 1) ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామంగా చెప్పుకోవచ్చు.
Teenmar Mallanna: ఇప్పటికే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయనకు పార్టీ అధిష్టానం ఫిబ్రవరి 5న షోకాజ్ నోటీసులను జారీ చేసింది. అదే నెల 12వరకు వివరణ కోసం అవకాశం కల్పించారు. వాటికి సమాధానం ఇవ్వకుండా మిన్నకుండిపోయారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ అదే పార్టీపై పదేపదే దూషణలకు దిగడంతో పార్టీ అధిష్టానం సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నది.
Teenmar Mallanna: కులగణన విషయంలో సొంతపార్టీ, ప్రభుత్వంపై తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే విధంగా బీసీ సంఘాల మీటింగ్‌లో ఓ సామాజిక వర్గం నేతలపై తీవ్రస్థాయిలో ఆయన దూషణలకు దిగారు. సొంత పార్టీకి చెందిన ముఖ్య నేతలపై కూడా తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానానికి వివిధ వర్గాల నుంచి ఫిర్యాదులు కూడా అందాయి.
Teenmar Mallanna: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యల కమిటీ మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించిందని కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్‌చార్జిగా హైదరాబాద్‌కు తొలిసారిగా మీనాక్షి నటరాజన్ వచ్చిన మరునాడే తీన్మార్ మల్లన్నపై వేటు పడటం పార్టీలో సంచలనంగా మారింది.