Dacoit: టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా యాక్షన్ మూవీ డెకాయిట్. టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లో ఈ సినిమా ఒకటి. ఈ సినిమా హిందీ మరియు తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతోంది. ప్రస్తుతం, హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది, తరువాత మహారాష్ట్రలో షెడ్యూల్ జరుగుతోంది.
ఈ మూవీలో ముందుగా శృతి హాసన్ ని హీరోయిన్ గా అనుకోగా ప్రస్తుతం ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది.మరో బాలీవుడ్ నటి వామిక గబ్బి ముఖ్య పాత్రలో నటిస్తోంది. షనీల్ డియో దర్శకత్వం వహించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుంది.
Also Read: Kiara Advani: అభిమానులకు కియారా అద్వానీ స్పెషల్ సర్ప్రైజ్!
Dacoit: తాజాగా ఈ సినిమా నుండి ఇప్పుడు మరో ప్రధాన పాత్రను పరిచయం చేసారు మేకర్స్. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మరియు నటుడు అనురాగ్ కశ్యప్ ఈ ప్రాజెక్ట్‌లో ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. అవినీతిని సహించని, ధైర్యవంతుడైన అయ్యప్ప భక్తుడైన నిర్భయ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించనున్నాడు అనురాగ్.
డకోయిట్ సినిమా అధికారిక టీజర్ :