Suryapet Police: పోలీస్ శాఖలో ఓ వినూత్న ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా సూర్యాపేట జిల్లా పోలీస్ అధికారులు అమలు చేస్తున్నారు. జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎస్ఐలు, ఇతర పోలీసులు వినూత్న ఆలోచనను అమలు చేస్తున్నారు. బాధితుల వద్దకే పోలీస్ సేవలు అన్న కోణంలో వారు అమలు చేస్తున్నారు.
Suryapet Police: శారీరకంగా, మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న వారి చెంతకే వెళ్లి పోలీసులు ఏదైనా ఫిర్యాదు ఉంటే స్వయంగా తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నారు. మానవీయ కోణంలో ఈ ప్రజాహిత సంస్కరణను వారు పాటిస్తూ వస్తున్నారు. పోలీస్ స్టేషన్ అంటే భయం లేకుండా, పోలీసులు అంటే జంకు లేకండా ఉండేందుకే దీనిని అమలు చేస్తున్నామని ఆ జిల్లా పోలీస్ అధికారులు చెప్తున్నారు.
Suryapet Police: ఏదైనా బాధితులకు అన్యాయం జరిగితే వారి వద్దకే నేరుగా వెళ్లి ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. దీనికి అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు శ్రీకారం చుట్టారు. బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగకుండా వారికి న్యాయం జరిగేంత వరకూ సంబంధిత పోలీసులు సమన్వయం చేస్తారు. వారికి భరోసా కల్పించి వారు సహాయం పొందేలా చొరవ తీసుకుంటున్నారు.
Suryapet Police: బాధితులు ఫోన్ కాల్ ద్వారా నేరుగా పోలీసులను సంప్రదించవచ్చు. అవసరమైతే ఆన్‌లైన్ లేదా ఇతర మార్గాల ద్వారా కూడా సమాచారం అందజేయవచ్చు. బాధితుల నుంచి సమాచారం అందగానే సంబంధిత పోలీస్ సిబ్బంది వెంటనే బాధితుల వద్దకు నేరుగా చేరుకుంటారు. వారు ఉన్న చోటే వారి సమస్యలను ఆసాంతం విని, అక్కడే ఫిర్యాదు పత్రాన్ని పోలీసులు నేరుగా తీసుకుంటారు.
రోడ్డు ప్రమాద బాధితుల వద్దే చివ్వెంల పోలీసుల ఎఫ్ఐఆర్
Suryapet Police: సూర్యాపేట జిల్లాలోని చివ్వెంల మండల కేంద్రంలోని పోలీసులు ఆ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మండల పరిధిలోని వల్లభాపురం గ్రామ శివారులో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆటో ప్రమాదానికి గురైంది. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. ఆ సమయంలో ఎవరో 100కు ఫోన్‌కాల్ చేసి చివ్వెంల పోలీసులకు సమాచారం అందజేశారు.
Suryapet Police: వెంటనే స్పందించిన చివ్వెంల పోలీసులు సూర్యాపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల వద్దకు నేరుగా చేరుకున్నారు. గాయాల పాలైన వారిని, సాక్షులను విచారించారు. బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. ఆసుపత్రిలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి, ఒకరికి మెరుగైన చికిత్స అవసరమైతే హైదరాబాద్ తరలించారు.
