Tejashwi Yadav

Tejashwi Yadav: తనయుడికి పగ్గాలు అప్పగించిన లాలూ.. ఆర్జేడీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా తేజస్వీ యాదవ్!

Tejashwi Yadav: బీహార్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) పార్టీ పగ్గాలను తనయుడు తేజస్వీ యాదవ్‌కు అప్పగిస్తూ ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా (National Working President) తేజస్వీని నియమించారు. నేడు (జనవరి 25, 2026) పట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.

ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు లాలూ ప్రసాద్ యాదవ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. లాలూ వయస్సు, అనారోగ్య కారణాల దృష్ట్యా పార్టీ రోజువారీ వ్యవహారాలను, ముఖ్యమైన నిర్ణయాలను ఇకపై తేజస్వీ నేరుగా పర్యవేక్షించనున్నారు. లాలూ స్వయంగా తన కుమారుడికి నియామక పత్రాన్ని అందజేయడం విశేషం.

ఇది కూడా చదవండి: NEET PG 2026 Exam Date: నీట్ పీజీ, ఎండీఎస్ – 2026 షెడ్యూల్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే?

పార్టీని బలోపేతం చేయడంతో పాటు, పార్టీలోని విభేదాలను చక్కదిద్దడం మరియు రాబోయే ఎన్నికల కోసం వ్యూహరచన చేయడం ఇప్పుడు తేజస్వీ ముందున్న ప్రధాన సవాళ్లు. ఇప్పటికే బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు, తాజా నియామకంతో జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు మరియు అధికారాలు లభించనున్నాయి. ఆర్జేడీ శ్రేణులు ఈ నిర్ణయాన్ని  ‘కొత్త యుగానికి నాంది’గా అభివర్ణిస్తూ సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే, కుటుంబంలోని ఇతర సభ్యుల నుండి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *