Suriya 46

Suriya 46: ఊపందుకున్న సూర్య 46 షూటింగ్!

Suriya 46: తమిళ స్టార్ హీరో సూర్య తన తాజా చిత్రం ‘సూర్య 46’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు వెంకీ అట్లూరి రూపొందిస్తున్న ఈ ద్విభాషా చిత్రం తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఇటీవల పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ను టీమ్ తాజాగా స్టార్ట్ చేసింది. పళని మురుగన్ ఆలయంలో దర్శనం తర్వాత షూటింగ్ జోరందుకుంది. ఈ సందర్భంగా రిలీజైన కొత్త పోస్టర్‌లో సూర్య స్టైలిష్ బ్యాక్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘The Celebration Begins’ అంటూ టీమ్ ఉత్సాహంగా పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ చిత్రంలో సూర్య సరసన యంగ్ హీరోయిన్ మమితా బైజు నటిస్తుండగా, రవీనా టాండన్, రాధిక లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్ సూర్య అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. సినిమా విడుదల కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Parenting Tips: పిల్లల అల్లరి వల్ల పదే పదే కోపం వస్తుంటే.. ఈ చిట్కాలతో ప్రశాంతంగా ఉండండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *