Supreme Court Of India: ఓ లైంగికదాడి కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆ కేసు విచారణపై తీవ్రస్థాయిలో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ధర్మాసనం వ్యాఖ్యలు కొంత మేరకు సరైనవే అయినా, అన్ని కేసుల్లో ఇలాంటి వాదనలే రావని కూడా విశ్లేషిస్తున్నారు.
Supreme Court Of India: ఢిల్లీ నోయిడా ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వయసున్న మహిళను స్వీట్లో మత్తు పదార్థాలు కలిపి లైంగికదాడి చేసిన విషయంలో 23 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌పై పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు 9 నెలలు జైలులో గడిపాడు. ఆ యువకుడి బెయిల్ విచారణ జరిపే సమయంలో పోలీసులపై సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగానే ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court Of India: 40 ఏళ్ల వయసున్న ఆమె చిన్నపిల్ల కాదు కదా అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఆమె అనుమతి లేకుండా లైంగికదాడికి పాల్పడ్డాడంటే నమ్మాలా? అని నిలదీసింది. ఒకే చేతితో చప్పట్లు మోగుతాయా? అతడిపై సెక్షన్ 376 ఎలా నమోదు చేశారు? అంటూ బాధిత మహిళ పట్ల జస్టిస్ బీవీ నాగరత్నం ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.
Supreme Court Of India: తొమ్మిది నెలలు జైలులో ఉన్న ఆ యువకుడిపై ఆరోపణలు ఎందుకు నిరూపించలేదంటూ ధర్మాసనం ప్రశ్నించింది. ఆ మహిళ అతడితో పలుమార్లు జమ్ముకు కూడా వెళ్లిందంటూ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అతనిపై పెట్టిన క్రూరమైన సెక్షన్ల పట్ల ఎలాంటి ఆధారాలు లేవని, ఆ యువకుడి బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.