Sunny Leone: పోర్న్ స్టార్ సన్నీలియోన్ కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘త్రిముఖ’. ఈ సినిమాతో యోగేష్ కల్లే హీరోగా పరిచయం అవుతున్నాడు. సీఐడీ ఫేమ్ ఆదిత్య శ్రీవాత్సవ, సుమన్, నాజర్, మొట్ట రవీంద్రన్, ప్రవీణ్, ఆషురెడ్డి, తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. యువ నటుడు యోగేష్ ఈ సినిమాతో పాటు ‘చాణుక్యం’, బెజవాడ బోయ్స్’ చిత్రాల్లోనూ నటిస్తున్నాడు. ‘చాణుక్యం’లో హెబ్బాపటేల్ నాయికగా నటిస్తోంది. ఇక ‘త్రిముఖ’ విషయానికి వస్తే ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను రాజేశ్ నాయుడు, శ్రీదేవి మద్దాలి దర్శకత్వంలో హర్ష కల్లే నిర్మిస్తున్నారు. మార్చిలో ఈ చిత్రం జనం ముందుకు వస్తున్నారు. తెలుగులో ఇప్పటికే పలు చిత్రాలలో నటించిన సన్నీ లియోన్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.