Jaat

Jaat: మళ్ళీ పుంజుకుంటున్న’జాట్’!

Jaat: బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా ‘జాట్’ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలతో సందడి చేస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం, ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలి రోజు ₹9.5 కోట్ల నెట్ కలెక్షన్‌తో బోళ్తా కొట్టిన ‘జాట్’, రెండో రోజు ₹7 కోట్లకు పడిపోయి 400 షోలను కోల్పోయింది. అయితే, వీకెండ్‌లో ఊపందుకుని మూడో రోజు ₹9.75 కోట్లు, నాలుగో రోజు ₹14 కోట్లతో జోరు చూపించింది. ఐదో రోజు ₹7.25 కోట్లతో మొత్తం ₹47.5 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్, ₹63.75 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించింది. రాజస్థాన్, యూపీ, హర్యానాలో సన్నీ డియోల్ ఫ్యాన్ బేస్‌తో సింగిల్ స్క్రీన్స్‌లో బలంగా ఆడుతున్న ‘జాట్’, మల్టీప్లెక్స్‌లలో మాత్రం వెనుకబడింది. ‘గదర్ 2’తో పోలిస్తే కలెక్షన్స్ తగ్గినప్పటికీ, సన్నీ మాస్ ఇమేజ్‌తో ఈ మూవీ ఇంకా ఆశలు రేకెత్తిస్తోంది. రందీప్ హూడా, రెజీనా కాసాండ్రా కీలక పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, వర్కింగ్ డేస్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Coolie: 'కూలీ' కోసం పనిలో దిగిన శృతి హాసన్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *