Hyderabad:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరుకు చెందిన ఓ బీటెక్ స్టూడెంట్ హైదరాబాద్ వచ్చాడు. ఎందుకనుకుంటున్నారు? ఉద్యోగం కోసం కాదు.. డ్రగ్స్ అమ్ముతూ విలాసంగా బతకొచ్చని అనుకున్నాడు. ఏకంగా డ్రగ్స్ వేరే ప్రాంతం నుంచి తక్కువ ధరకు తెలస్తూ రెట్టింపు రేట్లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటూ ఉండేవాడు. ఈ దశలోనే పోలీసులకు పట్టుబడి కటకటాలు లెక్కించాల్సి వచ్చింది.
Hyderabad:హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంలో ఉన్న సుష్మ థియేటర్ సమీపంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడే అనుమానాస్పదంగా తిరుగతుఉన్న జాన్ అనే యువకుడి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకొని, అతడిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన జాన్ అనే బీటెక్ పూర్తి చేసిన యువకుడు గ్రాము ఎండీఎంఏ డ్రగ్స్ను వేరే ప్రాంతంలో రూ.2,500కు తెచ్చి, నగరంలో రూ.5,000 చొప్పున అమ్మకాలు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది.
Hyderabad:చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఎందరో యువకులు ఇలాంటి ఉచ్చులో పడి తమ జీవితాలనే నాశనం చేసుకుంటున్నారు. అధిక సొమ్ము ఆశతో ఎవరో చెప్పిన మాటలు విని ఈ దందాలో చేరుతున్నారు. చివరికి తమ భావి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తమ తమ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నారు. ఇలాంటి దందాలో ఎక్కువ మంది ఉన్నత విద్యాభ్యాసం చేసిన యువకులే ఉండటం ఆందోళనకరం.