anjali devi

Anjali Devi: అంజలీదేవి స్పెషల్

Anjali Devi: తెలుగువారి మదిలో ‘సీతమ్మ’గా కొలువై ఉన్నారు మహానటి అంజలీదేవి… ఎందరో స్టార్ హీరోస్ కు తల్లిగా నటించి  మెప్పించారామె… ‘సువర్ణసుందరి’గా అభిమానుల మనసుల్లో చెరిగిపోని ముద్రవేశారు అంజలీదేవి… ఆ మహానటి నటనావైభవాన్ని మననం చేసుకుందాం.

తెలుగు సినిమా స్వర్ణయుగం చూసిన రోజుల్లో అనేక చిత్రాలలో విశేషంగా అలరించారు అంజలీదేవి… ఆమె ధరించిన వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులను కట్టిపడేశాయి… ముఖ్యంగా తెలుగు తెరపై ‘సీతమ్మ’గా అంజలీదేవి అభినయాన్ని ఎవరూ మరచిపోలేరు.

Anjali Devi: అంతకు ముందు ఆ తరువాత ఎందరు సీతాదేవి పాత్ర పోషించినా, అంజలీదేవి స్థాయిలో ఎవరూ మెప్పించలేక పోయారనే చెప్పాలి… 1963లో విడుదలై విజయఢంకా మోగించిన ‘లవకుశ’ చిత్రంలో సీతమ్మగా అంజలీదేవి అభినయాన్ని నవతరం ప్రేక్షకులు సైతం ఇష్టపడుతున్నారు… పర్వదినాలలో బుల్లితెరపై దర్శనమిచ్చే ‘లవకుశ’ సినిమా చూసి అంజలీదేవి అభిమానులుగా మారిపోయారెందరో… అంతలా సీతమ్మ పాత్రలో ఆకట్టుకున్నారు అంజలీదేవి.

ఇది కూడా చదవండి: Jani Master: 37 రోజుల్లో..: జానీ మాస్టర్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

అంజలీదేవి అనగానే ముందుగా ‘లవకుశ’లోని సీతమ్మ పాత్రనే గుర్తు చేసుకుంటారు జనం… ఆ తరువాత ఆమె అందాల అభినయాన్ని మననం చేసుకుంటూ ‘సువర్ణసుందరి’గా అంజలి అలరించిన తీరునూ తలచుకుంటారు… ‘సువర్ణసుందరి’గా దక్షిణాదివారినే కాదు ఉత్తరాది జనాన్ని సైతం విశేషంగా మురిపించారు అంజలీదేవి.

Anjali Devi: పౌరాణిక, జానపద చిత్రాల్లోనే కాదు, పురాణగాథల ఆధారంగా జానపద బాణీలో రూపొందిన చిత్రాల్లోనూ అంజలీదేవి అభినయం ఆకట్టుకుంది… ‘చెంచులక్ష్మి’ చిత్రంలో లక్ష్మీదేవిగా, చెంచులక్ష్మిగా అంజలి అలరించిన తీరును ఎవరూ మరచిపోలేరు… అందులో చలాకీ చెంచితగా అంజలి నటన ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేసింది.

తెలుగువారిని విశేషంగా అలరించిన జానపద గాథలు ఉన్నాయి… వాటిలో తెలుగునేలపైనే జరిగిన కథగా ‘బాలనాగమ్మ’ నిలచింది… ఇందులో మాయల పకీరుకు భూలోకంలోనే అందమైన భామగా బాలనాగమ్మ కనిపిస్తుంది… ఆ పాత్రలో అంతే అందంగా అభినయించారు అంజలీదేవి..కార్యవర్ధి రాజు భార్య బాలనాగమ్మ పాత్రలోనూ అంజలీదేవి తన ముందుతరంలో ఆ పాత్ర పోషించిన వారిని మరిపించారు.

ఇది కూడా చదవండి: Pushpa 2: బిగ్గెస్ట్ రిలీజ్ చిత్రంగా ‘పుష్ప2’ రికార్డ్!?

Anjali Devi: అంజలీదేవి తనకు లభించిన ఏ పాత్రకైనా న్యాయం చేయాలని తపించేవారు… విజయనగర సామ్రాజ్యంలోని కాశీనాథ శాస్త్రి కళానైపుణ్యంతో రూపొందిన చారిత్రకగాథ ‘జయభేరి’… ఇందులో మంజులవాణిగా అంజలి అభినయం అలరించిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు… ‘జయభేరి’ తరువాతి రోజుల్లో ఓ కళాఖండంగా నిలవడానికి అంజలీదేవి నటన కూడా ఓ కారణమని విజ్ఞులు విశ్లేషించారు.

ALSO READ  Good news: ఇక ఆ పన్ను కట్టాల్సిన పని లేదు..

తెలుగువారినే కాదు యావద్భారతీయులనూ విశేషంగా అలరించిన జానపదం ‘భట్టి విక్రమార్క’… ఈ కథతో తెరకెక్కిన చిత్రంలోనూ అంజలీదేవి నాయిక పాత్రలో భలేగా మురిపించారు… ‘భట్టి విక్రమార్క’లో ప్రభావతీ దేవిగా అంజలీవేవి అభినయం ఆ నాటి  ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టింది.

Anjali Devi: అనేక విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా నటించి మెప్పించారు అంజలీదేవి… అందుకు ‘కీలుగుర్రం’లో ఆమె పోషించిన మోహిని పాతనే నిదర్శనమని చెప్పవచ్చు… తన అందంతో రాజును వశపరచుకున్న మోహిని, రాత్రి కాగానే నిజరూపంలో ఏనుగులను భక్షించే భూతంగా మారిపోతుంది… నిజానికి ఓ అందాలతార అలాంటి పాత్రను పోషించడానికి అంగీకరించడమే ఓ సాహసం… సదరు పాత్రలోనూ అంజలీదేవి మెప్పించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *