Salman khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపులు వచ్చాయి. రూ.2కోట్లు ఇవ్వాలని, లేదంటే సల్మాన్ ఖాన్ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తి ముంబయి ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ పంపాడు.సల్మాన్ రూ. 2 కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశాడు. లేదంటే చంపేస్తామని బెదిరించాడు. వెంటనే అప్రమత్తమైన వర్లి జిల్లా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మాజీమంత్రి బాబా సిద్దిఖీ కుమారుడు జీషన్ సిద్దిఖీని చంపేస్తామని బెదిరించిన 20 ఏళ్ల నిందితుడిని పోలీసులు నిన్న నోయిడాలో అరెస్ట్ చేసి ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబై తీసుకొచ్చారు. నిందితుడిని మహమ్మద్ తయ్యబ్ అలియాస్ గుర్ఫాన్‌ఖాన్‌గా గుర్తించారు. గుర్ఫాన్ కూడా సల్మాన్, జీషన్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు.
దసరా సందర్భంగా జీషన్ కార్యాలయం ముందు టపాసులు కాలుస్తుండగా బాబా సిద్దిఖీ హత్యకు గురయ్యారు. ఈ హత్య చేసింది తామేనని ఆ తర్వాతి రోజు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. సల్మాన్‌ఖాన్‌తో సన్నిహితంగా ఉండడం వల్లే సిద్దిఖీని హత్య చేసినట్టు పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశారు.
https://x.com/PTI_News/status/1851480014933663836?t=3C0LGmhXnULJRJfon3H2eg&s=19