IIIT Basara: నిర్మల్ జిల్లాలోని బాసరలోని ఆర్‌జీయూకేటీ ట్రిపుల్ ఐటీ కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. పీయూసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతిప్రియ తన హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయం సోమవారం తెల్లవారుజామున వెలుగుచూసింది. స్వాతిప్రియది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ ప్రాంతం. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.