Hyderabad: హైదరాబాదులో దారుణం జరిగింది. ఇంటి అద్దె కట్టలేదని ఓ నివాసి పై యజమాని దాడి చేశాడు. అత్తాపూర్ ఏరియా హసన్ నగర్ లో ఓ యువతి కుటుంబం అద్దెకు ఉంటుంది. కొంత కాలంగా ఆ యువతి ఇంటి అద్దె చెల్లించటం లేదు. ఈ క్రమంలోనే ఇంటి యజమానితో వివాదం నడుస్తుంది. అద్దె కడ్తలేరని యజమాని ఇంటికి కరెంట్ కట్ చేశాడు. దీంతో వివాదం పెద్దది అయ్యింది. మాటలు దాటి.. చేతల వరకు వచ్చింది. ఇంటికి కరెంట్ కట్ చేయటంపై అద్దెకు ఉన్న యువతి.. ఇంటి యజమానితో గొడవకు దిగింది.
ఈ క్రమంలోనే ఇంటిని ఖాళీ చేయాలంటూ ఇంటి ఓనర్.. గొడవకు దిగాడు. యువతి పై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చేతికి, తలకు గాయాలు అయ్యాయి.కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. యజమాని తనపై దాడి చేశాడని కుటుంబ సభ్యులు యువతి తరఫున పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంటి యజమాని స్పందిస్తూ..అద్దె కట్టకుండా తననే వేధిస్తున్నారని.. ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇంటి యజమాని అంటున్నారు.