South Central Railway: రైల్వే ట్రాక్‌ల మరమ్మతు నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాజీపేట-కొండపల్లి సెక్షన్‌లోని మోటమర్రి రైల్వేస్టేషన్ వద్ద ప్రస్తుతం మూడో రైల్వేలైన్ నిర్మాణంలో ఉన్నది. ఇందులో భాగంగా చేపట్టనున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడిచే పలు ట్రైన్లను రద్దు చేశారు.
South Central Railway: ఈ నెల 25 నుంచి వచ్చే జనవరి 9 వరకు ఆయా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఉంటుందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. తెలంగాణ నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఆయా తేదీల్లో డోర్నకల్-కాజీపేట మెమూ (07754), డోర్నకల్ -విజయవాడ మెమూ (07755), కాజీపేట-డోర్నకల్ మెమూ (07753), విజయవాడ-భద్రాచలం రోడ్డు మెమూ (07979), భద్రాచలం రోడ్డు-విజయవాడ మెమూ (07258), విజయవాడ-డోర్నకల్ మెమూ (07756) రైళ్లను రద్దు చేశారు.
South Central Railway: డిసెంబర్ 28, 29, జనవరి 2, 5, 7, 8, 9 తేదీల్లో ట్రైన్ నంబర్ 12705 గుంటూరు-సికింద్రాబాద్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, 12706 సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, డిసెంబర్ 27, జనవరి 1, 4, 7, 8, 9 తేదీల్లో 12713వ నంబర్ విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్, 12714వ నంబర్ సికింద్రాబాద్-విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు అయ్యాయి.
పాక్షికంగా రద్దయిన రైళ్ల వివరాలు
గుంటూరు-కాజీపేట మధ్య నడిచే ట్రైన్ నంబర్ 17201ను డిసెంబర్ 27, జనవరి 9 మధ్య, కాజీపేట-గుంటూరు మధ్య నడిచే నంబర్ 17202 గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. దూరప్రాంతాల మధ్య నడిచే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను మళ్లించారు. డిసెంబర్ 27, 28, జనవరి 1, 4, 6, 7, 8 తేదీల్లో ఆదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు, జనవరి 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను రీషెడ్యూల్ చేశారు.