Sonu Sood: సోనూసూద్ కు నటుడిగా కంటే ఇవాళ దేశ వ్యాప్తంగా మానవతా వాదిగా మంచి గుర్తింపు ఉంది. ప్రాంతం, భాష అనే బేధభావాలు లేకుండా దేశంలో ఆ మూల నుండి ఈ మూల వరకూ ఎవరికి ఏ సహాయం చేయాలన్నా తన పరిధిలో చేస్తూనే వచ్చాడు. ముఖ్యంగా కరోనా సమయంలో సోనూసూద్ చేసిన సేవకు యావత్ భారతదేశం ఫిదా అయిపోయింది. ఈ నేపథ్యంలో అతనికి సీఎం పోస్ట్ ను కూడా కొందరు ఆఫర్ చేశారట.
ఇది కూడా చదవండి: Narendra Modi: మోడీ క్యాబినెట్ రైతులకు బహుమతి!
Sonu Sood: దీనిని గురించి సోనూసూద్ ఇటీవల ఓ మీడియాలో చెబుతూ… నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అందుకే అలాంటి ఆఫర్స్ ను తిరస్కరించారు. దాంతో డిప్యూటీ సీఎం గా చేయమని, రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేస్తామని కొందరు అడిగారు. కానీ వాటిని నేను స్వీకరించాలని అనుకోలేదు. ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలలోనే ఉండాలని నేను భావించాను. పైగా అక్కడ ఉంటే ఎంతో జవాబుదారీ తనంతో ఉండాలి. ఇప్పుడైతే నేనే ఆ పనిని నచ్చిన విధంగా, స్వేచ్ఛగా చేయగలుగుతున్నాను’’ అని అన్నారు. సోనూసూద్ హీరోగా నటించిన ‘ఫతే’ మూవీ జనవరి 10న వరల్డ్ వైడ్ విడుదల కాబోతోంది. దీనికి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం.