Sobhita Dhulipala: అక్కినేని వారి పెద్ద కోడలు శోభిత ధూళిపాళ్ల తాజా వెకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమిళనాడులోని గ్రామీణ సంస్కృతిని ఆస్వాదించిన శోభిత, సింపుల్ జీన్స్ లుక్‌లో సరదాగా గడిపారు. కొబ్బరి బోండాం తాగుతూ, స్థానిక మహిళలతో ముచ్చటిస్తూ, పచ్చని ప్రకృతిలో మునిగిపోయారు. కెమెరాలో ఈ అందమైన క్షణాలను బంధించిన ఆమె, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. శోభిత స్టైలిష్ లుక్‌ను ప్రశంసిస్తూ, ఆమె గడిపిన మధుర క్షణాలు అద్భుతమని కామెంట్లు వస్తున్నాయి. ప్రస్తుతం శోభిత ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ కనిపిస్తున్నాయి. ఆమె సరళమైన జీవనశైలి, సహజత్వం అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ వెకేషన్ ఫోటోలతో శోభిత మరోసారి అభిమానుల హృదయాలను గెలుచుకున్నారు.
View this post on Instagram