Jagan Nellore Cancel: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కష్టాల్లో ఉంటే, నెలల తరబడి జైళ్లో ఉంటే పరామర్సిమచే బాధ్యత లేకుండా జగన్ తప్పించుకున్నాడని నెల్లూరు జిల్లా వైసీపీ క్యాడర్ ఢీలా పడుతోందట. జగన్ టూర్‌కు పోలీసుల ఆంక్షలు, కేసుల భయంతో జన సమీకరణ మా వల్ల కాదని నెల్లూరు వైసీపీ లీడర్లు చేతులేత్తేశారని ప్రచారం జరుగుతోంది. కోట్లు ఖర్చు పెట్టి జనాలను తెచ్చి, పోలీసులతో కొట్టించుకుని, కేసుల్లో అరెస్ట్ కావడం ఎందుకని భావించిన జిల్లా వైకాపా లీడర్లు… జగన్ నెల్లూరు టూర్ పక్కా ఫెయిల్ అవుతుందని పార్టీకి సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది. కాకాణి పరామర్స యాత్రని బల ప్రదర్సనగా మార్చి, జిల్లా వ్యాప్తంగా హంగామా చేయాలనుకున్న జగన్‌కు ఇది పెద్ద షాకే అంటున్నారు నెల్లూరు పుర ప్రముఖులు. ఇక ప్రతి జిల్లాలో నెల్లూరు పోలీసులు లాగే టఫ్ రూల్స్ జగన్ యాత్రలకు పెడితే.. జన హంగామా, డ్రోన్ షాట్స్, జనసమీకరణ చాలా కష్టం అంటూ వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోందట.
దాదాపు పది రోజుల కిందటే జగన్ నెల్లూరు పర్యటన, కాకాణికి జైలులో పరామర్శ షెడ్యూల్ ఖరారైంది. అప్పటి నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హడావుడి, హంగామా చేయడం మొదలైంది. రెండ్రోజులకోసారి మీడియా ముందుకు వచ్చి.. దుమ్ము రేపుతాం.. దడదడలాడిస్తాం.. మామూలుగా ఉండదు.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం.. అంటూ డైలాగులు దంచుతూ వచ్చారు. భారీ జన సమీకరణ చేసి.. జగన్‌కి పలికే స్వాగతం చూసి.. ప్రజలు, టీడీపీ నేతలు పిచ్చెక్కిపోవాలంటూ ప్రకటనలు చేశారు. సోమవారం కూడా ప్రెస్ మీట్ పెట్టి.. హెలిప్యాడ్‌కు పర్మిషన్ ఇవ్వలేదని.. అయినా మా ప్లాన్లు మాకున్నాయని, దేవుడు దిగొచ్చినా ఆపలేరని తొడకొట్టారు. అది చూసిన నెల్లూరు జిల్లా నెటిజన్లు… హెలీకాఫ్టర్‌కి పర్మిషన్ లేదు, కారులో వెళ్లేందుకు అనుమతి లేదు.. మరి జగనన్నని పల్లెవెలుగు బస్సులో నెల్లూరుకు తీసుకొద్దాం అనా.. అనిల్ అన్న ప్లాను? అంటూ సెటైర్లు పేల్చారు. ఏది ఏమైనా.. కన్నెర్ర చేసి, పల్లు కొరికి, ఉరిమి ఉరిమి చూసి, చొక్కా మడతబెట్టి, తొడకొట్టిన అనిల్ యాదవ్‌ని జోకర్‌ని చేశారు జగన్‌మోహన్‌రెడ్డి. అనిల్ ప్రకటనలకు విరుద్దంగా నెల్లూరు పర్యటనను క్యాన్సిల్ చేసుకున్నారు.
Also Read: Case on Pawan Kalyan: ఒక్క స్పీచ్‌తో నిద్రలేని రాత్రుల్ని మిగిల్చాడా?
Jagan Nellore Cancel: మొత్తానికి జగన్ రెడ్డి వస్తాడని నమ్ముకుని.. తొడలు కొట్టిన అనిల్ కుమార్ పరువు మాత్రం పోయింది. తమ నేత జైలుకెళ్లిన తర్వాత పట్టించుకునే నాధుడే లేడని కాకాణి అభిమానులు దిగులు పడుతున్నారట. పార్టీ నుండి న్యాయ సహాయం కూడా పెద్దగా ఉండటం లేదని, కొమ్మినేని కోసం సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ ఇప్పించారని.. అదే మా కాకాణి విషయంలో ఎందుకు స్పందించడం లేదని కనిపించిన వాడినల్లా ప్రశ్నిస్తున్నారట. జగన్ మాత్రం.. కాకాణి అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ.. కేవలం బలప్రదర్శకు వీలు లేదనే కారణంతో కాకాణిని పరామర్శించే కార్యక్రమాన్ని పక్కనపెట్టడం ఇప్పుడు కాకాణి అనుచరులని, అభిమానులని మరింత హర్ట్ చేస్తోందట.