Siva Karthikeyan: స్టార్ హీరోగా ఎదిగినా… డౌన్ టు ఎర్త్ ఉంటాడు తమిళ నటుడు శివ కార్తికేయన్. తాను చిత్రసీమలోకి అడుగుపెట్టి ఎదుగుతున్న క్రమంలో చాలామంది తనను తక్కువచేసే చూసేవారని? ఇక్కడ నీకేం పని అన్నట్టుగా ప్రవర్తించే వారని శివ కార్తికేయన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అయితే తానెప్పుడూ వాటిని మనసులోకి తీసుకోలేదని, సిన్సియర్ గా పనిచేస్తూ నవ్వుకుంటూ ముందుకు సాగానని అన్నాడు. చాలామంది మాటలతో కాకుండా ‘తమ విజయంతో సమాధానం చెప్పాలనుకుంటార’ని కానీ తాను ఆ విధంగా కూడా అనుకోనని శివ కార్తికేయన్ అన్నారు. తన చిత్రాల విజయం ప్రత్యర్థులకు సమాధానం చెప్పాలని తాను అనుకోనని, ఆ సినిమా కోసం పాటు పడిన వారికి, అభిమానులకు ఆనందాన్ని ఇవ్వాలన్నదే తన అభిమతం అని శివ కార్తీకేయన్ చెప్పారు. ఇటీవల శివకార్తికేయన్ నటించిన ‘అమరన్’ సినిమా 300 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి… భారీ విజయాన్ని అతని ఖాతాలో వేసింది.