Lover Boy: గత యేడాది రాజ్ తరుణ్ ఏకంగా నాలుగు సినిమాల్లో నటించాడు. నాగార్జున ‘నా సామిరంగ’లో కీలక పాత్ర పోషించిన రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’, ‘తిరగబడరా సామి’, ‘భలే ఉన్నాడే’ చిత్రాలలో హీరోగా నటించాడు. కానీ ఇవేవీ అతనికి వివాదాలు తెచ్చినంత పేరును తెచ్చిపెట్టలేదు. తాజాగా కొత్త సంవత్సరంలో అతని నాయా మూవీకి సంబంధించిన వార్త వచ్చింది. రామ్ కుడుముల దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా మాధవి, ఎం.ఎస్.ఎం. రెడ్డి ‘పాంచ్ మినార్’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఇందులో రాశీసింగ్ హీరోయిన్. ఈ క్రైమ్ కామెడీకి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో అజయ్ ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
వినోదానికి సిద్ధం కమ్మంటున్న మమ్ముట్టి!
Mammootty: మలయాళ సీనియర్ నటుడు మమ్ముట్టి పోషించని పాత్ర లేదు. ఏ పాత్ర చేసినా.. అందులో తనదైన మార్క్ ను చూపించడం అనేది ఆయనకు అలవాటు. సుదీర్ఘ నట జీవితంలో వైవిధ్యమైన పాత్రలెన్నో పోషించిన మమ్ముట్టి ఇప్పుడు ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ చిత్రంలో వినోదాన్ని పండించే డిటెక్టివ్ గా నటిస్తున్నారు. ఇటీవల ఆ సినిమా టీజర్ విడుదలైంది. మూవీని ఇదే నెల 23న జనం ముందుకు తీసుకురాబోతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ… మేకర్స్ తమ డిటెక్టివ్ సృష్టించే అద్భుతాను వీక్షించడానికి సిద్థంగా ఉండమని కోరుతున్నారు. ఇందులో గోకుల్ సురేశ్, లీనా సారా, మీనాక్షి ఉన్నికృష్ణన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.